జూలై 7, 2026

WhatsApp Image 2024 01 10 at 11.11.54 AM

TRINETHRAM NEWS

Trinethram News : Crime News : కొడుకు కొత్త దుస్తులు కొనివ్వలేదని తండ్రి ఆత్మహత్య

పటాన్‌చెరు: కుమారుడు కొత్త దుస్తులు కొనివ్వలేదని అలిగిన తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. అమీన్‌పూర్‌ ఎస్సై రమణాచారి వివరాల ప్రకారం.. అన్నమయ్య జిల్లా వాయల్పాడు మండలం చాకిరేవుపల్లికి చెందిన రమణయ్య(63) కుమారుడు మహేశ్‌తో కలిసి 6నెలల క్రితం అమీన్‌పూర్‌ పురపాలక పరిధి పీజేఆర్‌ఎన్‌క్లేవ్‌ కాలనీకి వచ్చారు..

మహేశ్‌ ఓ స్థిరాస్తి సంస్థలో వాచ్‌మెన్‌గా పని చేస్తున్నాడు. 3నెలల క్రితం రమణయ్యకు పక్షవాతం వచ్చింది. మంగళవారం మహేశ్‌ పుట్టినరోజు సందర్భంగా తనకు కొత్త దుస్తులు కొనాలని కుమారుడిని రమణయ్య అడిగాడు. జీతం వచ్చిన తరువాత కొంటానని మహేశ్‌ చెప్పాడు. దీనిపై తండ్రీకొడుకుల మధ్య గొడవ జరిగింది. మహేష్‌ ఉదయం బాత్‌రూంకు వెళ్లి వచ్చేసరికి సంస్థ కార్యాలయం పక్కనే ఉన్న కమాన్‌కు రమణయ్య ఉరేసుకున్నాడు..

You cannot copy content of this page