తేదీ : 29/05/2025. బాపట్ల జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , బాపట్ల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కొరిశపాడు మండలం, మేదరమెట్ల జాతీయ రహదారిపై ఓ కారు డివైడర్ ను ఢీ కొట్టింది. ఈ ప్రమాద సమయంలో కారులో నలుగురు ఉండగా ఒక మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ప్రమాదానికి సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను సమీపంలోని వైద్యశాలకు తరలించారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


