Road Accident : భద్రాద్రి కొత్తగూడెంలో ఘోర రోడ్డు ప్రమాదం!

TRINETHRAM NEWS

పలువురికి తీవ్ర గాయాలు!
Trinethram News : భద్రాది జిల్లా: నవంబర్ 21 : భద్రాది కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం ముష్టిబండ గ్రామం వద్ద ఈరోజు ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది, ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సును అతి వేగంతో టాటా ఏసీ వాహనం ఢీ కొట్టింది ఈ ఘటనలో పలు వురికి తీవ్ర గాయాలయ్యా యి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం….

కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నుంచి వస్తున్న టాటా ఏసీ వాహనం నియంత్రణ కోల్పోయి ఎదురుగా వస్తున్న సూపర్ లగ్జరీ ఆర్టీసీ బస్సును బలంగా ఢీకొట్టింది దీంతో ప్రయాణి కులకు తీవ్ర గాయాలు అయ్యాయి, కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించారు.

అశ్వరావుపేట– ఖమ్మం ప్రధాన రహదారిపై ప్రమాదం జరగడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పోలీసులు సంఘటన స్థలం వద్ద సహాయక చర్యలు చేపట్టారు ధ్వంసమైన వాహనాలను క్రేన్ సహా యంతో తొలగిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాల ను తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Fatal road accident in Bhadradri Kothagudem

You cannot copy content of this page

Scroll to Top