Bhu Bharati Act : భూ భారతి చట్టం పై రైతులకు అవగాహన

TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ : చేవెళ్ల నియోజకవర్గం రైతుల సంక్షేమాభివృద్ధికే భూ భారతి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య నవాబ్ పేట్ మండల కేంద్రంలోని రైతు వేదికలో నిర్వహించిన భూ భారతి చట్టం పై రైతులకు అవగాహన సదస్సు లో పాల్గొన్న చేవెళ్ల స్థానిక శాసనసభ్యులు కాలే యాదయ్య.
ఎమ్మెల్యే మాట్లాడుతూ. రైతుల సంక్షేమాభివృద్ధి కోసమే ప్రభుత్వం భూ భారతి చట్టం తీసుకొచ్చిందన్నారు. భూవివాదాల సమస్యల పరిష్కారానికి భూ భారతి చట్టం ఎంతగానో దోహదపడుతుందన్నారు.
అనంతరం ఎమ్మెల్యే నవాబ్ పేట్ మండలానికి చెందిన లబ్ధిదారులకు మంజూరైన Rs.3,06,000/- రూపాయలు మూడులక్షల ఆరువేలు విలువ గల 8 ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో వికారాబాద్ జిల్లా కలెక్టర్ శ్రీ ప్రతీక్ జైన్ ప్రజాప్రతినిధులు, అధికారులు, మాజీప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, రైతులు మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Farmers' awareness on Bhu Bharati Act

You cannot copy content of this page

Scroll to Top