కూకట్పల్లి ఫిబ్రవరి 4 (త్రినేత్రం న్యూస్) : వరల్డ్ మాస్టర్ గేమ్స్–2026లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించనున్న మాస్టర్ క్రీడాకారులకు హైదరాబాద్‌లో ఘనంగా వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. ఈ అంతర్జాతీయ స్థాయి క్రీడా పోటీలు 2026 ఫిబ్రవరి 5 నుంచి ఫిబ్రవరి 15 వరకు అబుదాబిలో జరగనున్నాయి.
ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని ఎన్ సీ ఈ ఆర్ టి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వీడ్కోలు సభలో పలువురు ప్రముఖులు పాల్గొని క్రీడాకారులను అభినందించారు. తెలంగాణ ప్రభుత్వ సలహాదారు (క్రీడా వ్యవహారాలు) మరియు ఒలింపిక్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ అధ్యక్షులు ఎ.పి. జితేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై, మాస్టర్ క్రీడాకారులు అంతర్జాతీయ వేదికపై భారతదేశానికి గౌరవం తీసుకురావాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో మాస్టర్ గేమ్స్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ (ఎంజిఏటి) ఛైర్మన్ డాక్టర్ కె. రామ్ రెడ్డి, యునైటెడ్ స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ బి. లక్ష్మణ్,ఎంజిఏటి కార్యదర్శి డాక్టర్ వై. రామారావు, ఎంజిఏటి వైస్ ప్రెసిడెంట్ శ్రీ జి. రవీంకాత్ శర్మ, తెలంగాణ త్రో బాల్ అసోసియేషన్ కార్యదర్శి డాక్టర్ టి. కృష్ణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ప్రముఖులు మాట్లాడుతూ మాస్టర్ క్రీడాకారుల కృషిని ప్రశంసిస్తూ, వారి నిబద్ధత యువతకు ఆదర్శమని పేర్కొన్నారు. అంతర్జాతీయ పోటీల్లో భారత పతాకాన్ని ఎగరవేసేలా క్రీడాకారులు ఉత్తమ ప్రతిభ కనబరచాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమం మాస్టర్ క్రీడల ప్రోత్సాహానికి, క్రీడాకారుల్లో ఉత్సాహాన్ని నింపేందుకు దోహదపడిందని నిర్వాహకులు తెలిపారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


