TELANGANA

Don’t Compare Budget Schools : బడ్జెట్ పాఠశాలలను కార్పొరేట్ ఫిజులతో చూడొద్దు

TRINETHRAM NEWS

ట్రస్మా అధ్యక్షులు ఎస్ ఎన్ రెడ్డి… కూకట్పల్లి ఫిబ్రవరి 4 (త్రినేత్రం న్యూస్) : బడ్జెట్ పాఠశాలలను కార్పోరేట్ పాఠశాలలతో పోల్చి చూడవద్దని తెలంగాణ రాష్ట్ర గుర్తింపు పొందిన ప్రైవేటు పాఠశాలల యాజమాన్య సంఘం (ట్రస్మా ) రాష్ట్ర అధ్యక్షులు ఎస్ ఎన్ రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ట్రస్మా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కార్యవర్గ సమావేశం ఓల్డ్ బోయిన్పల్లి లోని గ్రీన్ వుడ్ పాఠశాలలో జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ ఫీజు రెగ్యులేషన్ కమిటీని తీసుకురావడంలో తప్పు లేదని కానీ కార్పొరేట్ ఫీజులను పరిగణలోకి తీసుకోవడమే బాధాకరమన్నారు. సామాన్యుల పిల్లలంతా బడ్జెట్ పాఠశాలల్లోనే చదువుతున్నారన్న విషయాన్ని ప్రభుత్వం గుర్తించాలన్నారు.

ఇక్కడి పాఠశాలల్లో ఫీజులు అత్యధికంగా ఉండవని గుర్తు చేశారు. ప్రొఫెషనల్ టాక్స్, ట్రేడ్ టాక్స్ పేరుట ఇబ్బందులకు గురి చేయొద్దని విజ్ఞప్తి చేశారు. సమాచార హక్కు చట్టం పేరుతో, విద్యార్థి సంఘాల పేరుతో, ఇతర సంఘాల పేర్లతో పాఠశాలల నిర్వాహకులను ఇబ్బందులకు గురి చేస్తున్న వారి నుంచి రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని విజ్ఞప్తి చేశారు.

తమ సమస్యల పరిష్కారం పై ప్రభుత్వం దృష్టి సారించకపోతే ఆందోళనకు కూడా సిద్ధమవుతామని హెచ్చరించారు. ఈ సందర్భంగా నూతన సంవత్సర క్యాలెండర్ ను, విద్యా సంస్థలకు సంబంధించిన పూర్తిస్థాయి జీవోలతో రూపొందించిన డైరీ ని ఆవిష్కరించారు.

కార్యక్రమంలో సంఘం అసోసియేట్ అధ్యక్షులు రామేశ్వర్ రెడ్డి, కోశాధికారి శ్రీకాంత్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి బిర్రు ఆంజనేయులు, కోశాధికారి గిరిబాబు, బాలానగర్ మండల అధ్యక్షులు రమేష్ రెడ్డి, జిల్లాలోని వివిధ మండలాల అధ్యక్ష కార్యదర్శులు, జిల్లా బాధ్యులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Don't compare budget schools

You cannot copy content of this page