Achuthanandan : అచ్యుతానందన్‌కు వీడ్కోలు

TRINETHRAM NEWS

అళప్పుజలో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు

అచ్యుతానందన్‌ భౌతికకాయానికి గౌరవ వందనం సమర్పిస్తున్న పోలీసులు

Trinethram News : అళప్పుజ : శ్రామికజన పక్షపాతి, దిగ్గజ కమ్యూనిస్టు నేత, కేరళ మాజీ ముఖ్యమంత్రి వి.ఎస్‌.అచ్యుతానందన్‌కు లక్షల మంది అభిమానులు అశ్రునయనాలతో కడపటి వీడ్కోలు పలికారు.

ఆయన భౌతిక కాయానికి బుధవారం రాత్రి 9 గంటల సమయంలో అళప్పుజలో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి. అచ్యుతానందన్‌ కుమారుడు అరుణ్‌కుమార్‌ తండ్రి చితికి నిప్పంటించారు. 1946లో పున్నప్ర-వయలార్‌ పోరాటంలో అమరులైన కమ్యూనిస్టు నేతల స్మారకాలు, సమాధులున్న వలియ చుడుకాడులో అంతిమ సంస్కారాలు జరిగాయి. 101 ఏళ్ల వయసులో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం అచ్యుతానందన్‌ తుది శ్వాస విడిచారు.

మంగళవారం మధ్యాహ్నం వరకూ తిరువనంతపురంలో ఆయన పార్థివదేహాన్ని ప్రజలు, అభిమానులు సందర్శించారు. ఆ తర్వాత ప్రత్యేకంగా అలంకరించిన బస్సులో ఊరేగింపుగా అళప్పుజకు తీసుకొచ్చారు. వర్షంపడుతున్నా లెక్కచేయకుండా అనేక గ్రామాల ప్రజలు ఆయనను కడసారి చూసేందుకు దారిపొడవునా గంటల తరబడి నిరీక్షించారు. తిరువనంతపురం నుంచి సుమారు 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న అలప్పుజకు చేరుకోవడానికి 16 గంటలకు పైగా సమయం పట్టింది. అనంతరం అచ్యుతానందన్‌ స్వగృహంలో, సీపీఎం జిల్లా కార్యాలయంలో ఆయన భౌతిక కాయాన్ని ఉంచగా పరిసర ప్రాంతాల నుంచి తరలివచ్చిన ప్రజలు దర్శించుకున్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Farewell Achuthanandan

You cannot copy content of this page

Scroll to Top