OC Community Hall : ఒ సి కమ్యూనిటీ హాల్ కు శంఖుస్ధాపన

TRINETHRAM NEWS

కపిలేశ్వరపురం : త్రినేత్రం న్యూస్ : కపిలేశ్వరపురం మండలం మాచర గ్రామంలో ఎం.పి ల్యాడ్స్ నిధులు రూ.40.00 లక్షలతో ఒ.సి కమ్యూనిటీ హాల్ నిర్మాణం కు సోమవారం అమలాపురం పార్లమెంట్ సభ్యులు గంటి హరీష్ మాధూర్ శంఖుస్ధాపన చేశారు. రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు అధ్యక్షత వహించారు. ముఖ్య అతిధిగా మండపేట నియోజకవర్గ జనసేనపార్టీ ఇన్ ఛార్జ్ వేగుళ్ళ లీలా కృష్ణ పాల్గొన్నారు. ఎం.పి హరీష్ మాట్లాడుతూ ఇచ్చిన మాట ప్రకారం అభివృద్ది, సంక్షేమం రెండు కళ్లు గా చంద్రబాబు నాయుడు ముందుకు వెళుతున్నారని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు సూచనల ప్రకారం మండపేట నియోజకవర్గాన్ని మరింత అభివృద్ది చేసేందుకు కృషిచేస్తానని పేర్కొన్నారు.

ఎమ్మెల్యే వేగుళ్ళ మాట్లాడుతూ గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఈ కమ్యూనిటీ హాల్ ను మంజూరు చేసి శంఖుస్ధాపన చేశామన్నారు. తరువాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఈ మంజూరు రద్దు చేసిందన్నారు. ఎటువంటి కమ్యూనిటీ హాల్ నిర్మాణం చెయ్యలేదన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఎం.పి హరీష్ మాధూర్ ఈ కమ్యూనిటీ హాల్ నిర్మాణం నకు రూ.40.00 లక్షలు మంజూరు చేశారన్నారు. అందుకు వారికి ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలియజేశారు. అనంతరం వేగుళ్ల లీలాకృష్ణ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చాక చెప్పిన ప్రతీ పని చేస్తున్నారన్నారు. కమ్యూనిటీ హాల్ నిర్మాణం కు నిధులు మంజూరు చేసినందుకు హరీష్ కు ధన్యవాదాలు తెలిపారు. రాబోయే రోజుల్లో మండపేట నియోజకవర్గ అభివృద్దికి మరింత సహకారం అందిచాలని ఎం.పి హరీష్ ను కోరారు. బి.ఆర్.అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

ఈ కార్యక్రమంలో రాష్ర్త శెట్టిబలిజ కార్పొరేషన్ డైరెక్టర్ గుడాల జయబాబు, అమలాపురం పార్లమెంట్ అధికార ప్రతినిధి పుత్సల శ్రీను, కోరుమిల్లి సర్పంచ్ ఆచంట సత్యనారాయణ, కపిలేశ్వరపురం సర్పంచ్ సాక శ్రీనివాసు, గొడవర్తి సత్యనారాయణ, గుడిసె ప్రసాద్, కోన భగవాన్, గుడాల చినరాజు, మట్టపర్తి శ్రీరామమూర్తి, వనుం వెంకన్న, జాస్తి అబ్బు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పువ్వుల చిట్టిబాబు, మాజీ ఎంపిపి నెక్కంటి రాంజి, చలికి నారయ్య, అడపా సత్తిబాబు, బడుగు నల్లయ్య, తదితర్లు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Foundation stone laid for

You cannot copy content of this page

Scroll to Top