ఆగస్ట్ 20, 2026
TRINETHRAM NEWS
Extensive police checks

డాగ్ స్క్వాడ్ తో మత్తు పదార్థాల వేట

Extensive Police Checks : దేవరకొండ డివిజన్ జులై 25, త్రినేత్రం న్యూస్. నల్గొండ జిల్లా ఎస్పి శరత్ చంద్ర పవార్ ఐ సి ఎస్, ఆదేశాల మేరకు పోలీసులు శనివారం దేవరకొండ పట్టణంలో ఆకస్మికంగా విస్తృత తనిఖీలు నిర్వహించారు. బస్టాండ్ పరిసర ప్రాంతాలు ,,లాడ్జిలు ,పాన్, కిరాణం షాపులన క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. అనుమానాస్పద వ్యక్తులను డాగ్ స్క్వాడ్ సహాయంతో తనిఖీలు చేసారు.

ఈ సందర్భంగా ఎ స్ హెచ్ ఓ బి రాజు మాట్లాడారు డాగ్ స్క్వాడ్ లారా డ్రగ్స్ మత్తు పదార్థాలను గుర్తించడంలో నైపుణ్యతను ప్రదర్శిస్తుందని తెలిపారు. యువత, విద్యార్థులు డ్రగ్స్ (మత్తు పదార్థాల )కు బానిసలు కావొద్దని సూచించారు.

భవిష్యత్తు నాశనం చేసే మత్తు పదార్థాల సంస్కృతిపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు .ఎవరైనా నిషేధిత పదార్థాలను విక్రయించిన రవాణా చేసిన చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. పట్టణంలో శాంతి భద్రతల పరిరక్షణకు నేరాల నియంత్రణకు ప్రజలు పోలీసులకు సహకరించాలని, అనుమానాస్పద సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page