Mon. Mar 9th, 2026

Executive Officer visited the Secretariat : సచివాలయం సందర్శించిన కార్యనిర్వాహణాధికారి

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ గంగాధర నెల్లూరు నియోజకవర్గo. ఫిబ్రవరి 18. ఈరోజు మంగళవారం జిల్లా పరిషత్ ముఖ్య కార్య నిర్వహణ అధికారి చిత్తూరు వారు పెనుమూరు మండలం పెనుమూరు గ్రామ సచివాలయం సందర్శించినారు. ఈ సందర్భంగా ఆయన సచివాలయ సిబ్బంది యొక్క హాజరు పట్టిని, మూమెంట్ రిజిస్టర్ తనిఖీ చేశారు.

సర్వేలు సకాలంలో పూర్తి చేయాలని, సిబ్బంది ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. అలాగే మండలంలో జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి ఎంపీడీవో నీలకంఠేశ్వర రెడ్డి ని అడిగి తెలుసుకున్నారు.

పనులను సకాలంలో పూర్తి చేయాలని లేనియెడల నిధులు విడుదల కావని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పెద్దినేని రుద్రయ్య నాయుడు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Executive Officer visited the Secretariat

Related Post

You cannot copy content of this page