ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్
దేవరకొండ ఆగష్టు 26 త్రినేత్రం న్యూస్. దేవరకొండ పట్టణంలోని మున్సిపల్ కమిషనర్ వై.సుదర్శన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన “మట్టి వినాయక ప్రతిమల” పంపిణీ కార్యక్రమంలో పాల్గొని, పట్టణ ప్రజలకు ఉచితంగా వినాయక ప్రతిమలను అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి ఎం ఎల్ ఏ బాలు నాయక్ పంపిణీ చేసారు.
పర్యావరణానికి హాని కలిగించని మట్టి వినాయక ప్రతిమలను ప్రతి ఒక్కరూ పూజించాలని ఎమ్మెల్యే అన్నారు. ప్రతి ఒక్కరూ పర్యావరణహిత వినాయక చవితిని జరుపుకోవాలని కోరారు. మట్టితో తయారు చేసిన వినాయక ప్రతిమలను పూజించి పర్యావరణానికి హాని కలిగించకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, వివిధ అనుబంధ సంఘాల నాయకులు, పట్టణ ముఖ్య నాయకులు, మున్సిపల్ సిబ్బంది, అధికారులు, మాజీ కౌన్సిలర్లు, యూత్ కాంగ్రెస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


