Trinethram News : డ్రగ్స్ రహిత సమాజాన్ని ఏర్పాటు చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ నీయులైన ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో నిర్వహిస్తున్న ప్రజా పాలన ప్రగతి నివేదన 99 రోజుల సదస్సులో భాగంగా ఈరోజు మడికొండ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రగ్స్ నివారణ కోసం TGNAB సహకారంతో మత్తు పదార్థాల వ్యతిరేక అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది.
ఈరోజు కార్యక్రమాన్ని పురస్కరించుకొని అన్ని ప్రభుత్వ విభాగాలైన పోలీస్, ఎక్సయస్,రెవిన్యూ, మున్సిపల్, విద్య, ఆరోగ్య మరియు మహిళా విభాగం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. దీనికి గౌరవ నీయులైన సెంట్రల్ జోన్ DCP దార కవిత ముఖ్య అతిధిగా విచ్చేసారు.
ఈ సందర్బంగా DCP కవిత మాట్లాడుతూ యువత చాలా మంది మత్తు పదార్థాల బారినపడి తమ విలువైన జీవితాలను కోల్పోతున్నారని మత్తుపదార్థాలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. డ్రగ్స్ నివారణ కోసం పోలీస్ డిపార్ట్మెంట్ ఆవిశ్రాంతంగా కృషి చేస్తుందని అందులో భాగంగా TGNAB, ఈగల్ టీమ్, మరియు మన వరంగల్ పోలీస్ కమీషనరేట్ తరుపున డ్రగ్స్ కంట్రోల్ టీమ్స్ ను ఏర్పాటు చేసి గంజాయి ఇతర మత్తు పదార్థాలను నిర్మూలించడం కోసం కృషి చేస్తున్నారు.
ఇతర ప్రభుత్వ విభాగల నుండి వచ్చిన అధికారులు కూడా డ్రగ్స్ నివారణ కోసం చాలా విలువైన సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో సుమారు 700 మంది మడికొండ గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


