ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకోవాలి.
త్రినేత్రం న్యూస్, ప్రకాశం జిల్లా, కంభం మండలం.
కంభం పట్టణంలోని సిఎల్ఆర్ జూనియర్ మరియు డిగ్రీ కళాశాలలో జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ప్రతిజ్ఞ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కళాశాల కరస్పాండెంట్ సయ్యద్ షా అలీభాష మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఓటు నమోదు చేసుకోవాలని ఆకాంక్షించారు. ఇంటర్మీడియట్ కళాశాల డైరెక్టర్ సిరిగిరి బ్రహ్మం మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్క ఓటరూ బాధ్యతగా ఓటు హక్కును వినియోగించుకోవడమే జాతీయ ఓటర్ల దినోత్సవం ప్రధాన ఉద్దేశమన్నారు. సి.ఎల్.ఆర్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ గుండాల ముక్తేశ్వరరావు మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియలో యువత చురుకుగా పాల్గొనేలా ప్రోత్సహించడమే ఓటర్ల దినోత్సవం ప్రధాన లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో జూనియర్ కళాశాల డైరెక్టర్ సిరిగిరి బ్రహ్మం, కళాశాల అధ్యాపక బృందం గుండాల ముక్తేశ్వరరావు, ఏనుగుల రవికుమార్, ముతకపల్లి శ్రీనివాసరెడ్డి, జి డేవిడ్,పివి ఆంజనేయులు, పాలిశెట్టి నవీన్, ఉప్పు నారాయణ, కైతా రాజేశ్వరి, బి అరుణ కుమారి, కే బ్యూల, బి వనజ, తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App