ప్రతి అడుగు దేవరకొండ అభివృద్ధికోసం. నేనావత్ బాలు నాయక్
చందంపేట మార్చ్ 13, త్రినేత్రం న్యూస్. చందంపేట మండలంలోని మార్పు నూతల బండమీది తండాలో ఎం జీ ఎన్ ఆర్ ఈ జీ ఎస్ నిధులతో నూతనంగా నిర్మించనున్న సిసి రోడ్డు నిర్మాణ పనులకు అధికారులు ప్రజాప్రతినిధులతో కలిసి దేవరకొండ శాసనసభ్యులు నేనావత్ బాలు నాయక్ శంకుస్థాపన చేశారు. మార్పునుంతల గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ కార్యక్రమంలో పాల్గొన్నారు.
చందంపేట మండల కేంద్రంలో కేజీబీవీ పాఠశాలలో 85.50 లక్షల రూపాయల వ్యయంతో పీఎంసీ టీం నిర్మించిన అదనపు తరగతి గదులు మరియు సైన్స్ ప్రయోగశాల మరమత్తు పను లను ప్రారంభోత్సవం చేయడం జరిగింది. మానవ తండాలో గ్రామపంచాయతీ పవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయడం జరిగింది. అనంతరం గ్రామ మహిళా సమస్య సంఘం భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.
గ్రామ ప్రజలకు మెరుగైన రహదారి సౌకర్యాలు కల్పించాలని ఉద్దేశంతో ఈ పనులను ప్రారంభించినట్లు తెలిపారు గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తుందని అన్నారు. భవిష్యత్తు తెలంగాణకు బలమైన మానవ వనరులే పునాది అందుకే ఉచిత విద్య వైద్యం ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యాలు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులు మహిళలు అధికారులు యువజన కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.


