Rajiv Yuva Vikasam : నిరుద్యోగ యువతకు ఉపాధి రాజీవ్ యువ వికాసం

TRINETHRAM NEWS

రాజీవ్ యువ వికాసం కోసం దరఖాస్తులు చేసుకోవాలి. ఎంపీడీవో. వెంకన్న.
డిండి (గుండ్ల పల్లి) ఏప్రిల్ 10 త్రినేత్రం న్యూస్. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రాజీవ్ యువ వికాసం దరఖాస్తుల ప్రక్రియ మండలకేంద్రంలో ముమ్మరంగా సాగుతోందని మండలపరిషత్అభివృద్ధి అధికారి వెంకన్నతెలిపారు.

మండల పరిషత్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకొనేవారికోసం ప్రత్యేకమైన హెల్ప్ డెస్క్ లను ఏర్పాటు చేసి ప్రజలు యువతకుసందేహాలు నివృత్తి చేసి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ఆయన తెలిపారు.దరఖాస్తు చేసుకున్నవారు నేటికీ 559 దరఖాస్తులు కార్యాలయంలోఅందచేసారని తెలిపారు.దరఖాస్తులు నేటికీ కేటగిరివారిగా ఎస్సీ ,(162) ఎ స్టి ( 149) బి సి (210) ఈ బి సి (8) మైనారిటీ (30) ఇట్టి రోజు వారీ దరఖాస్తుల వారి వివరాలను ఇండెంట్లో పొందు పరుస్తూ ప్రతి రోజూ వచ్చిన దరఖాస్తు వివరాలను జిల్లా కేంద్రమునకు తెలియ జేస్తున్నట్లు ఈ సందర్భంగా ఆయన తెలిపారు.
అలాగే అర్హులైన ప్రతి ఒక్కరు. రాజీవ్ యువ వికాసానికి దరఖాస్తు చేసుకోవాలని మండలంలోని నిరుద్యోగ యువతీ యువకులకు పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో మండల పరిషత్ సీనియర్ అసిస్టెంట్ శివానందo,జూనియర్ అసిస్టెంట్ నవీన్ కుమార్, అజయ్, శివాజీ మరియు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Employment for unemployed

You cannot copy content of this page

Scroll to Top