జూలై 7, 2026

WhatsApp Image 2024 02 11 at 19.19.15

TRINETHRAM NEWS

మార్కాపురం ప్రాంతానికి చెందిన ప్రముఖ సైంటిస్ట్ డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి బిజెపి తీర్థం పుచ్చుకొనున్నారు. వైఎస్ఆర్సిపి రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉన్న ఏలూరి ఆ పార్టీకి రాజీనామా చేసి బిజెపిలో చేరుతున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ లో రాష్ట్ర అధికార ప్రతినిధిగా పనిచేశారు. డా.ఏలూరి రామచంద్రా రెడ్డి 2017 ఎంఎల్ సి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నపుడు వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణం కోసం ఉద్యమాలు నిర్వహించారు. ఇప్పటికే బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు డి.పురందేశ్వరిని మర్యాద పూర్వకంగా కలిసి చర్చించారు. .

You cannot copy content of this page