నేడు 15 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు, ఫలితాలు కూడా

TRINETHRAM NEWS

Trinethram News : దేశంలో 15 రాజ్యసభ స్థానాలకు(Rajya Sabha seats) నేడు (ఫిబ్రవరి 27న) పోలింగ్ జరగనుంది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది..

సాయంత్రం 5 గంటల నుంచి కౌంటింగ్ జరగనుంది. ఉత్తరప్రదేశ్‌లోని 10, కర్ణాటకలో నాలుగు, హిమాచల్‌ప్రదేశ్‌లోని ఒక స్థానానికి పోలింగ్ జరగనుంది. 15 స్థానాల్లో హోరాహోరీ పోటీ జరగనుండగా..మూడు రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న స్థానాల కంటే ఒకరి కంటే ఎక్కువ మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు..

ఉత్తరప్రదేశ్‌లోని 10 రాజ్యసభ స్థానాలకు మంగళవారం ఓటింగ్(voting) జరగనుంది. మొత్తం 11 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరిలో భారతీయ జనతా పార్టీకి చెందిన 8 మంది, సమాజ్‌వాదీ పార్టీకి చెందిన 3 మంది ఉన్నారు. 403 మంది సభ్యులున్న యూపీ అసెంబ్లీలో కేవలం 397 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఓటు వేసేందుకు అర్హులు..

You cannot copy content of this page

Scroll to Top