Crowded with Tourists : దుందుభి నది గల గల

TRINETHRAM NEWS

డిండి జలాశయం జలకళ
పర్యాటకుల రద్దీతోకలకల
డిండి(గుండ్ల పల్లి)ఆగష్టు 10 త్రినేత్రం న్యూస్. డిండి జలాశయానికి దుందుభి నది వరద ప్రవాహం పెరిగింది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఎక్కువగా వర్షాలు కురువడంతో దుందుభి నది పరవళ్ళు తొక్కుతుంది.ఆదివారం మధ్యాహ్నం వరకు ప్రాజెక్టు లో నీటి మట్టం 22 అడుగుల 8 అంగుళాల కు చేరిందని జలాశయంలోకి 710 క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చి చేరుతుందని అసిస్టెంట్ ఇంజనీర్ పరమేష్ ఒక ప్రకటనలో తెలిపారు.
ప్రాజెక్టు నీటి మట్టం 36 అడుగులు కాగా వరద ప్రవాహంఇలాగే కొనసాగితే ప్రాజెక్టు అలుగు పారె అవకాశం ఉందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Dundubhi River Gala Gala

You cannot copy content of this page

Scroll to Top