
Drone Attack : దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో సోమవారం డ్రోన్ దాడి జరిగింది. దీంతో ఎయిర్పోర్ట్లోని ఇంధన ట్యాంకుల వద్ద అగ్నిప్రమాదం సంభవించింది. అయితే, సివిల్ డిఫెన్స్ సిబ్బంది సకాలంలో స్పందించి మంటలను విజయవంతంగా అదుపులోకి తెచ్చారని దుబాయ్ మీడియా తెలిపింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు స్పష్టం చేశారు. ప్రయాణికుల భద్రత దృష్ట్యా, ముందుజాగ్రత్త చర్యగా విమానాశ్రయంలో విమాన సేవలను తాత్కాలికంగా నిలిపివేసినట్లు పౌర విమానయాన సంస్థ ప్రకటించింది.

