
Dr. Swamy Naidu : అనంతగిరి జూన్ 9, (త్రినేత్రం న్యూస్): అల్లూరి జిల్లా అనంతగిరి మండల విద్యా, గిరిజన సంక్షేమ ఇంజినీరింగ్ శాఖ ఆధ్వర్యంలో జరిగిన మనబడి-మనభవిష్యత్తు కార్యక్రమం సోమవారం మండల విద్యాశాఖ కార్యాలయంలో నిర్వహించారు ఈ కార్యక్రమం నిద్దేశించి జిల్లా సమగ్ర శిక్ష ఏపీ సి డా, స్వామి నాయుడు మాట్లాడుతూ, మనబడి-మనభవిష్యత్తు కార్యక్రమంలో భాగంగా సంబంధిత ఆదర్శ ప్రాధామిక పాఠశాలల మౌలిక సదుపాయాలను కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలభవన మర్రమత్తులు,మరుగుదొడ్ల నిర్మాణాలు నీటి సదుపాయలు తరగతి గదులలో విద్యుత్,ఫ్యాన్స్ ఏర్పాటు,త్రాగునీరు ఏర్పాటు, బోర్డ్స్,అదనపు తరగతి గదుల ఏర్పాటుచేపట్టాలని వివరించారు అలాగే పూర్తిస్థాయిలో మండల ఇంజనీరింగ్ అధికారి సహకారంతో ప్రధానోపాధ్యాయులు సచివాలయ సిబ్బందితో సమన్వయంతో మండలంలో 14ఆదర్శ పాఠశాలలో పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాల కల్పనలో భాగస్వామ్యం కావాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి 1 కిల్లో బాలాజీ, విద్యాశాఖ అధికారి2 బిబి నాగేశ్వరరావు, ట్రైబల్ వెల్ఫేర్ ఇంజనీరింగ్ అధికారి గణేష్ ఎంఆర్సి,ఎం ఐ ఎస్ అచ్చిబాబు,సచివాలయ ఇంజనీరింగ్ అసిస్టెంట్స్, సి ఆర్ పి లు,ఆదర్శ ప్రాధమిక పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe