జూన్ 26, 2026
TRINETHRAM NEWS
Disciplined education

Disciplined Education : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : అశ్వరావుపేట నియోజకవర్గం, మండలం , భద్రాచలం రోడ్ సమీపంలో ఉన్నటువంటి గౌతమీ పాఠశాల ప్రిన్సిపాల్ మాట్లాడుతూ , విద్యార్థులకు ఆహ్లాదకరమైన వాతావరణంలో క్రమశిక్షణతో కూడిన విద్యాబోధన అందిస్తున్నామని అన్నారు. బోటనీ బాలాజీ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రాం తో విజయాన్ని అందరికీ అందుబాటులోకి తీసుకొస్తున్నామని పేర్కొన్నారు. ఆ పాఠశాలలో మొత్తం విద్యార్థులు మూడు వందల తొంభై ఆరు మంది అని తెలిపారు.

పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు ఇరువై ఎనిమిది మందిరాయగా అందరూ పాస్ అయినట్లు వెల్లడించారు. ఇ భవ్య శ్రీ ఐదు వందల అరవై రెండు మార్కులు సాధించి ప్రథమ స్థానాన్ని సాధించిందని, ఇరవై మంది విద్యార్థులు ఐదు వందల మార్కుల పైగా సాధించారని సంతోషం వ్యక్తం చేశారు. ప్రతి సబ్జెక్టుకు సంబంధించి ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు ఉన్నారని సూచించారు. అయితే రెండు వేల ఇరవై ఐదు _ ఇరవై ఆరు వసంవత్సరంలో జరిగినటువంటి యూనిఫైడ్ కౌన్సిల్ నిర్వహించిన ఒలంపియాడ్ పరీక్ష ఫలితాల్లో అత్యధిక బంగారు పథకాలు ఈ పాఠశాల విద్యార్థులు నలభై ఆరు మంది సాధించడం గర్వకారణంగా చెప్పవచ్చు. ఇద్దరు మాత్రమే నగదు బహుమతిని అందుకోవడం గొప్ప విశేషం.

ప్రతి అడుగు విజయవంతం దిశగా సాధించిన ఫలితాలే వేలాది మంది విద్యార్థులను
విజేతలుగా తీర్చిదిద్దిన ఘనత గౌతమి పాఠశాలది అని చెప్పారు.
ప్రముఖ విద్యావేత్త బాటనీ బాలాజీ విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికై రూపొందించినటువంటి ప్రత్యేక ప్రోగ్రాం.
అదేవిధంగా జాతీయస్థాయిలో నిర్వహించబడే నీట్, జేఈఈ, ఎన్ ఎస్ టీఎస్ ఈ , ఒ లం పైడ్ ఏ పోటీ పరీక్షకైనా ఛాలెంజ్ చేసే ఇంటి గ్రేటెడ్ సిలబస్ తో ఒకటవ తరగతి నుంచి శిక్షణ ఇవ్వబడుతుందని , ఒకటవ తరగతి నుండి ఐదవ తరగతి వరకు ఆ పోటీలలో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నామని తెలిపారు. అదేవిధంగా చిన్నారుల కొరకై ఆటపాటలతో అలరించేందుకు ప్రత్యేకంగా రూపొందించిన తరగతి గదులు మరియు ప్లే మెథడ్ విద్యాబోధన, శారీరక దృక్పథం, ఆరోగ్యము నైతిక విలువలతో కూడిన వ్యక్తిగత స్వీయ క్రమశిక్షణకై యోగా లాంటి వాటిని స్ట్రాంగ్ గా ఇస్తున్నామని, పరిమిత సంఖ్యలో విద్యార్థులతో స్పార్క్ క్యాంపస్ లాంటివి ఉన్నాయని అన్నారు.

సరైన బేసిక్ రాని విద్యార్థులకు ప్రత్యేకమైన తరగతులు నిర్వహిస్తున్నామని తెలిపారు. తిరుమల కుంట, వినాయకపురం, నారాయణపురం, గుమ్మడవల్లి, తదితర ప్రాంతాల నుండి విద్యార్థులు రావడం జరుగుతుందని వివరించారు. విద్యార్థులు పాఠశాలకు వచ్చినప్పటినుండి మళ్లీ ఇంటికి వెళ్లే వరకు ప్రతి ఒక్క ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు వాళ్లను బాధ్యతగా చూసుకుంటున్నారని సంబోధించారు. కొత్త క్యాంపస్ ఒకటి, రెండు నెలల్లో ప్రారంభం కానుందని స్పష్టం చేశారు. గతంలో మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు, రాష్ట్ర విద్యాధికారి ద్వారా అనేక బహుమతులు పొందినట్లు గుర్తు చేశారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page