Dr. Ramulu Naik : డా, రాములు నాయక్ అకాల మరణం దేవరకొండ ప్రజానీకానికి తీరనిలోటు

TRINETHRAM NEWS

డాక్టర్ రాములు నాయక్ పేద ప్రజలకు చేసిన సేవ చిరస్మనీయం
పవిత్రమైన వైద్య వృత్తినే దైవంగా భావించే మహోన్నత వ్యక్తి డాక్టర్ రాములు నాయక్.
అందరితో స్నేహంగా ఉండి, సమాజంలో గౌరవమైన స్థానాన్ని సంపాదించుకున్న మహోన్నతమైన వారు డాక్టర్ రాములు నాయక్ .
బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు,దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ .
దేవరకొండ ఆగష్టు 30 త్రినేత్రం న్యూస్. డాక్టర్ ఎన్ రాములు నాయక్ అకాల మరణం దేవరకొండ ప్రజానీకానికి తీరనిలోటు అని రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. శనివారం డాక్టర్ రాములు నాయక్ మృతి పట్ల ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ….డాక్టర్ రాములు నాయక్ పేద ప్రజలకు చేసిన సేవ చిరస్మనీయం అని ఆయన కొనియాడారు.పవిత్రమైన వైద్య వృత్తినే దైవంగా భావించే మహోన్నత వ్యక్తి అని, మంచికి మమతారాగాలను అందరికీ పంచి అహర్నిశలు శ్రమించిన ప్రేమ ఆప్యాయతలను రంగరించి వైద్యరంగంలో ఎందరికో ప్రాణం పోసిన ప్రాణదాత అని అన్నారు.అందరితో స్నేహంగా ఉండి, సమాజంలో గౌరవమైన స్థానాన్ని సంపాదించుకున్న మహోన్నతమైన వారు డాక్టర్ రాములు నాయక్ అని ఆయన తెలిపారు. డాక్టర్ రాములు నాయక్ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Dr. Ramulu Naik's untimely death

You cannot copy content of this page

Scroll to Top