WhatsApp Image 2024 12 05 at 3.11.22 PM
డ్రక్స్ పై అవగాహన కల్పించిన టూ టౌన్ ఎస్సై డాక్టర్ ఎం రాజమోహన్ రావు….
Trinethram News : ప్రకాశం జిల్లా. మార్కాపురం డిసెంబర్ 5 మార్కాపురం లోని రాయవరం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకుల బాలికల హై స్కూల్ నందు గురువారం సైబర్ నేరాలు మత్తుపదార్థాలు మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ ఎం రాజమోహన్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సైబర్ నేరాలు, ఆన్లైన్ మోసాలు ,ఎక్కువగా జరుగుతున్నాయని అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గంజాయి మత్తు పదార్థాలకు విద్యార్థులు బానిసలు కాకుండా క్రమశిక్షణతో మెలగాలని అన్నారు. ప్రధానంగా బాలికలను ఉద్దేశించి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ పట్ల అవగాహన కల్పించారు. బాలికల పట్ల తాకరానీ ప్రదేశంలో తాకుతూ అసౌకర్యాన్ని కల్పించే ఏ పని అయినా అది బ్యాడ్ టచ్ కిందికి వస్తుందని తెలిపారు . మైనర్ బాలికలను వేధింపులకు గురి చేస్తే ఫోక్సో కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. రోడ్డు ప్రమాదాల పట్ల అవగాహన కల్పించారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
