జూన్ 27, 2026

WhatsApp Image 2024 10 30 at 19.35.09

TRINETHRAM NEWS

జిల్లా కలెక్టర్ ను కలిసిన జనసేన పార్టీ, పాడేరు ఇంచార్జ్ : డా. గంగులయ్య.

ఆంధ్రప్రదేశ్, త్రినేత్రం న్యూస్, ( అల్లూరిజిల్లా ) జిల్లా ఇంచార్జ్: ( మణిబాబు ) జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ ని కలిసి గిరిజన ప్రాంతంలో పలు కీలక అంశాలపై ప్రస్తావన చేసిన, జనసేన పార్టీ పాడేరు ఇంచార్జీ డా.. గంగులయ్య.
ఆయన ప్రస్తావించిన అంశాలు క్లుప్తంగా,
1.జీవో నేం 3 పునరుద్ధరణ పై గిరిజన నిరుద్యోగ యువత భవిత ఆధారపడి ఉందని,
2.నానటికి పెరిగిపోతున్న గిరిజన శిశు మరణాలు వాటి నిర్మూలనపై ప్రభుత్వ యంత్రాంగం వారి విధానాలు,
3.అల్లూరి సీతారామరాజు జిల్లా వ్యాప్తంగా అనేక పర్యాటక ప్రదేశాల ప్రశస్తి, గురించి పర్యాటకులకు విపులంగా వివరించి వారి విడిదికి మౌలిక సదుపాయాలు కల్పన, అదేవిధంగా స్థానిక గిరిజన గ్రామాల మౌలిక సదుపాయాలు, కల్పన వంటి ఇంటర్ లింక్ సిస్టమ్ అభివృద్ధి.
4.విద్య మౌలిక సదుపాయాల,5.గిరిజనులకు అత్యుత్తమ విద్యాకేంద్రలుగా నెలకొన్న ఏకలవ్య విద్యాకేంద్రంలో అన్ని, గ్రూపులకు విద్య విధానం ఏర్పాటు చేయాలి.6.రైతుల లాభసాటి వ్యవసాయం ,గిరిజన నిరుద్యోగ యువత కు ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలు సృష్టి వంటి అంశాలపై సుదీర్ఘంగా కలెక్టర్ గారికి ఆయన వివరించి చెప్పడం జరిగింది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page