
Doubts over India : త్రినేత్రం న్యూస్ : Jun 12, 2026, భారత్, ఐర్లాండ్ మధ్య జూన్ 26, 28 తేదీల్లో జరగాల్సిన రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌పై ఆ దేశంలో నెలకొన్న భద్రతా పరిస్థితుల నేపథ్యంలో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఉత్తర ఐర్లాండ్‌లోని బెల్‌ఫాస్ట్ ప్రాంతంలో కత్తిపోటు ఘటన అనంతరం చెలరేగిన అల్లర్లు, పోలీసులపై దాడులు, జాత్యహంకార ఘటనలతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
క్రికెట్ ఐర్లాండ్ ఈ ఘటనలను నిశితంగా పరిశీలిస్తూ, దేశీయ టోర్నమెంట్ మ్యాచ్‌ల నిర్వహణపై 48 గంటల్లో నిర్ణయం తీసుకోనుంది. పరిస్థితులు మెరుగుపడకపోతే అంతర్జాతీయ సిరీస్‌పై కూడా ప్రభావం పడే అవకాశం ఉంది.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe