తేదీ : 15/05/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , నూజివీడు నియోజకవర్గం, చాట్రాయి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఘనంగా ప్రజా వేదిక కార్యక్రమం నిర్వహించడం జరిగింది. బూరుగుగూడెం, నరసింహారావు పాలెం, కృష్ణారావు పాలెం, చనుబండ, చిన్నంపేట, కోటపాడు, చీపురుగూడెం, పోతనపల్లి, చాట్రాయి, పోలవరం, జనార్ధన వరం, తుమ్మగూడెం, చిత్తపూరు, కొత్తగూడెం, మర్లపాలెం గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు తమ సమస్యకు సంబంధించి ఫిర్యాదుల ఆర్జి ధృవపత్రాలపై వ్రాసి ఎమ్మెల్యే, గృహ నిర్మాణ శాఖ, పౌర సంబంధాల మంత్రి కొ లుసు పార్థసారథి కి అందజేయగా సంబంధిత అధికారులను తక్షణమే ఆ సమస్యలకు పరిష్కారం చేయాలని సూచించారు. వెంటనే ఆన్లైన్ ద్వారా వాటికి మార్గదర్శకం చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో వచ్చినటువంటి ప్రజలకు మరియు, సంబంధిత అధికారులకు మంచినీరు, మజ్జిగ ప్యాకెట్లు, స్వీట్ మిచ్చిరి తినుబండారాలు ఇవ్వడం జరిగింది. ఎవరికి ఎటువంటి లోటుపాట్లు, రాకుండా ,లేకుండా సంబంధిత సిబ్బంది, ఉమ్మడి కూటమి , నాయకులు, కార్యకర్తలు, చూసుకున్నారు. రెవిన్యూ శాఖ, సిబ్బంది, పంచాయతీరాజ్ సిబ్బంది సంబంధిత అధికారులు పాల్గొన్నారు. అదేవిధంగా జిల్లా డిప్యూటీ కలెక్టర్ బి. స్మరణ్ రాచ్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. జిల్లా టిడిపి తెలుగు యువత ప్రధాన కార్యదర్శులు , బసవా రెడ్డి, మోరంపూడి. శ్రీనివాసరావు పాల్గొనడం జరిగింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


