![](https://trinethramnews.in/wp-content/uploads/2025/02/WhatsApp-Image-2025-02-06-at-09.45.23.jpeg)
డాలర్ డ్రీమ్స్ ఆవిరి.. తొలివిడతలో భారత్ చేరిన 104మంది
అమెరికా హోంలాండ్ అధికారుల లెక్కల ప్రకారం 20,407 మంది భారతీయుల దగ్గర సరైన పత్రాలు లేనట్లు గుర్తించారు. వీరిలో 17,940 మందిని వెనక్కి పంపేందుకు ఉత్తర్వులు జారీ చేశారు. బలవంతంగా అమెరికా నుంచి పంపించి వేయడంతో భారత్ చేరుకున్న 104 మంది భారతీయుల పరిస్థితి దారుణంగా తయారయ్యింది. డాలర్ డ్రీమ్స్ ఆవిరయ్యాయి.
భారత్‌కు తరలించిన వాళ్లను కదిలిస్తే కన్నీటికథలు బయటకు వస్తున్నాయి. తమ వాళ్ల ఆచూకీ కోసం ఇన్నాళ్లు తల్లడిల్లిన ఆప్తులు అమృత్‌సర్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. హర్యానాకు చెందిన 33 మంది, గుజరాత్‌కు చెందిన 33 మంది, పంజాబ్‌కు చెందిన 30 మంది, మహారాష్ట్ర, చండీఘడ్‌కు ముగ్గురు చొప్పున భారత్‌కు పంపించారు. అమెరికాకు ఎన్నో ఆశలతో వెళ్లామని, ఇలాంటి పరిస్థితి వస్తుందని కలలో కూడా ఊహించలేదు. 40 లక్షల రూపాయలు ఖర్చు చేసి వెళ్లారు.
తమ కొడుకుకు ఉజ్వల భవిష్యత్తును ఇస్తానని హామీ ఇచ్చి అమెరికాకు పంపామని కుటుంబసభ్యులు భోరుమన్నారు. కానీ ఇప్పుడు అతను ఖాళీ చేతులతో తిరిగి వచ్చాడని చెప్పారు. తమ కల చెదిరిపోయిందని, ఇప్పుడు ఈ భారీ అప్పును ఎలా తీర్చాలో ఆలోచిస్తున్నామని అంటున్నారు. మొత్తం మీద, ఒకవైపు, వారి కొడుకు తిరిగి రావడంతో కుటుంబం సంతోషంగా ఉండగా, మరోవైపు, అప్పుల భారం వారి తలపై ఉంది. ఎవరి గోడు వారు వెళ్ళబోసుకుని కన్నీటిపర్యవంతమయ్యారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
![Dollar Dreams Steam](https://trinethramnews.in/wp-content/uploads/2025/02/WhatsApp-Image-2025-02-06-at-09.45.23-1024x576.jpeg)