TRINETHRAM NEWS

దాతల పేర్లు ఉండటం సమంజసమా? పబ్లిసిటీ కోరుకునే నేతల పేర్లు ఉండటం సమంజసమా?

తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం,

త్రినేత్రం న్యూస్
శకుని మామ ఇలాంటి పేర్లు సూచించడం వల్లే గత ఎన్నికలలో మిమ్మల్ని “చిహ్నాలు” గా ప్రజలు మిగిల్చారని గుర్తు చేస్తున్నమన్న అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి.

అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ,

గడచిన ఐదేళ్ళుగా అనపర్తి నియోజకవర్గంలో ఏ విధమైన అభివృద్ది లేకపోయినా నీలిరంగు ఆర్చిలు ఏర్పాటు చేసుకుని అభివృద్ది ఫల ప్రదాత అని వాటిపైన పేర్లు వేసుకుని ఆనందించడం ఒక పరిపాటిగా మారింది.

పుట్టినరోజు వస్తే బలవంతంగా ప్లెక్సీలు పెట్టించడం, శిలాఫలకాల మీద సతీసమేతంగా పేర్లు వేయించుకోవడం వంటి చర్యలతో గత పాలకుల పబ్లిసిటీ పిచ్చతో పబ్లిసిటీ జాతర గా మారిపోయింది.

తనకు ఏమాత్రం సంబంధం లేని విషయాలలో కూడా తానే అభివృద్ది చేసినట్లుగా ఆనాటి నాయకులు ఆర్చిల నిర్మాణం చేసుకున్నారు.

కేంద్ర నిధులతో అనపర్తి – తొస్సిపూడి రోడ్డు వేస్తే తనకు ఏమాత్రం సంబంధం లేకపోయినా అభివృద్ది ఫల ప్రదాత అని తనపేరుతో ఆర్చి నిర్మించుకున్న మహానుభావులు నాటి పాలకులు,

ఈ ఆర్చిల ఏర్పాటులో కూడా వివక్ష చూపారు. దళిత సర్పంచ్ లు, బిసి సర్పంచ్ ల పేర్లు ఆర్చిల పేర్లు లేకుండా చేసారు.

ఇటువంటి తప్పిదాలను సరిచేసే భాధ్యత మాపై ఉన్నందున అనపర్తి – తొస్సిపూడి ఆర్చికి ప్రధానమంత్రి గ్రామ సఢక్ యోజనగా పేరు మార్చి ప్రధానమంత్రి, పోటో పెట్టించి ప్రోటోకాల్ ని పాటించే విధంగా చర్య తీసుకున్నాం.

అలాగే అనపర్తి శేషగిరిరావు పేటకు ఒక ముఖద్వారం ఏర్పాటు చేసి దానికి శకునిమామ రచనతో శేషగిరిరావుపేట అభివృద్దికి చిహ్నం అని పేరు పెట్టారు. అసలు “చిహ్నం” అని ఏ సందర్భానికి వాడతారో వీరికి తెలియకపోవడం శోచనీయం

15 వ ఆర్దిక సంఘం నిధులతో చేసిన అభివృద్ది పనులకు వీరికి సంబంధం ఏమిటి ? కేంద్ర ప్రభుత్వ నిధులతో చేసిన పనులకు ఆయన పేరెలా పెడతారు ? కనీసం సర్పంచ్ గారి పేరు కూడా వేయలేదు ? యంపిపి గారి పేరు యంపిటిసిల పేరు కూడా లేదు. పంచాయితీ తీర్మానంలో ఈ పేరు పెడుతున్నట్లు కూడా పేర్కొనలేదు.

06-01-2025 న సర్పంచ్ వారా కుమారి, అధ్యక్షతన జరిగిన సాధారణ సమావేశంలో చినపొలమూరు ముఖద్వారం నకు మాచరమ్మతల్లి ముఖద్వారంగాను, రిజిస్ట్రర్ ఆఫీసు ముఖద్వారానికి మార్కండేయపురం ముఖద్వారంగాను, శేషగిరిరావుపేట వద్ద ముఖ ద్వారాన్ని శేషగిరిరావుపేట ముఖ ద్వారంగాను, అలాగే అనపర్తిలో వివిధ చోట్ల ఏర్పాటు చేసిన ఆర్చిలకు పేర్లు మార్చవలసిందిగా గ్రామ ప్రజలు చేసుకున్న దరఖాస్తులను పరిశీలించి తీర్మానం ఆమోదించడం జరిగింది.

శేషగిరిరావు, అనే మహానుభావుడి దాతృత్వంతో భూమి దానంగా ఇవ్వడం అక్కడ ఇళ్ళు నిర్మాణం జరిగితే వారి పేరు తీసేసి చిహ్నంగా మిగిలిపోవాలనుకునే నాయకుల పేర్లు పెట్టడం ఎంతవరకు సమంజసం?

ప్రజలందరినీ కోరేది ఒక్కటే. దాతల పేర్లు ఉండటం సమంజసమా? తమకు సంబంధం లేని విషయాలకు పబ్లిసిటీ కోసం తమ పేర్లు వేసుకునే నాయకుల పేర్లు ఉండటం సమంజసమా? ఆలోచించమని కోరుతున్నాను

తమ పేర్లు పోతాయన్న అక్కసుతో పంచాయితీ కార్యాలయానికి వచ్చి దౌర్జన్యం చేయడం, అలాగే దళిత సర్పంచ్ ని పావుగా వాడుకోవడం సమంజసం కాదని తెలియజేస్తున్నాను

చినపొలమూరులో మాచరమ్మ తల్లి ప్రసిద్ది. అక్కడ ఆ దేవత పేరు ఉండటం సమంజసమా? చిహ్నంగా మిగలాలని భావించిన నేతల పేరు ఉండటం సమంజసమా? ఒక్కసారి ఆలోచించండి

చిహ్నం అనే పదాన్ని ఎక్కడ ఎందుకు వాడతారో తెలుసుకోమని శకుని మామని కోరుతున్నాను. మీరిలాంటి పేర్లు సూచించడం వల్లే గత ఎన్నికలలో మిమ్మల్ని “చిహ్నాలు” గా ప్రజలు మిగిల్చారని గుర్తు చేస్తున్నమన్న అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App