Dodla Venkatesh Goud : డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన దొడ్ల వెంకటేష్ గౌడ్

TRINETHRAM NEWS

కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ జూలై 8 : దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి జయంతి సందర్భంగా 124 ఆల్విన్ కాలనీ డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ వారి కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి వై.ఎస్.ఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది.

ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ తో ఎందరికో ప్రాణాలు పోసి, ఫీజు రియంబర్స్మెంట్ తో పేద విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపి, రుణమాఫీ మరియు ఉచిత విద్యుత్తుతో అన్నదాతకు వెన్నుదన్నుగా నిలిచి, కాలేశ్వరం ప్రాజెక్టుకు తొలి అడుగులు వేసి, హ్యాండ్లూమ్స్, పార్క్, మూసి కాల్వల ఆధునీకరణ మొదలగు అభివృద్ధి సంక్షేమ పథకాలతో ఉమ్మడి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రిగా ఎంతో సేవ చేసిన మహానేత వై.ఎస్.ఆర్ ఆశయాలు మనందరికీ ఆదర్శం అని గుర్తుచేశారు. కార్యక్రమంలో యువనేత దొడ్ల రామకృష్ణ గౌడ్, సమ్మారెడ్డి, పోశెట్టిగౌడ్, వంశీ గౌడ్, బషీర్, ఖలీమ్, నాగరాజు, రాజు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Dodla Venkatesh Goud paid

You cannot copy content of this page

Scroll to Top