DM&HO Submitted a Petition : డీ ఎం అండ్ హెచ్ ఓ వినతిపత్రం ఇచ్చిన ఎన్ హెచ్ ఎం పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు ఎల్.సురేష్ నాయక్.

TRINETHRAM NEWS

2 నెలల పెండింగ్ వేతనాలు, ఏడు నెలల పి ఆర్ సీ ఏరియర్స్ తక్షణమే చెల్లించాలనీ డిమాండ్

పెద్దపల్లి జిల్లా. 04 నవంబర్ త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. పెద్దపల్లి జిల్లాలో జాతీయ ఆరోగ్య మిషన్ కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ విధానంలో పని చేస్తున్న ఉద్యోగులకు పెండింగ్ లో ఉన్న 2 నెలల వేతనాలు చెల్లించాలని కోరుతూ మంగళవారం డీ ఎం అండ్ హెచ్ ఓ డాక్టర్.వాణి శ్రీ వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎన్ హెచ్ ఎం కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ (ఏఐటీయూసీ అనుబంధం) పెద్దపెల్లి జిల్లా అధ్యక్షులు ఎల్.సురేష్ నాయక్ మాట్లాడుతూ ప్రతీ నెల 1వ తేదీనే వేతనాలు చెల్లించి, సుప్రీంకోర్టు తీర్పు మేరకు ఎన్హెచ్ఎం ఉద్యోగులందరికీ సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని,మహిళా ఉద్యోగులకు వేతనంతో కూడిన 180 రోజుల సెలవులు మంజూరు చేయాలని, ఎన్.టి.ఈ.పి.లో పనిచేస్తున్న ఉద్యోగులకు పెట్రోల్ అలివేన్సులు టి.ఏ, డి.ఏ
3 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్నాయని వెంటనే ఇప్పించాలని, ఏ జిల్లాలో పని చేస్తున్న ఎన్ హెచ్ ఎం ఉద్యోగులకు డిప్యూటేషన్లు మరియు ట్రాన్స్ఫర్లు కల్పించాలని వినతిపత్రంలో పేర్కొన్నారు. డి ఎం అండ్ హెచ్ ఓ కార్యాలయంలో పనిచేస్తున్న డి పి పీ ఎం ప్రభాకర్, ఎన్. టీ ఈ. పీ. గోపి, తిరుపతి, రవీందర్, శ్రీనివాస్ ,శ్రావణి , సురేందర్, ఎన్ హెచ్ ఎం ఉద్యోగులు అంజయ్య, సురేష్, పావని, మమత, సంపత్, తదితరులు పాల్గొన్నారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

DM&HO submitted a petition to NHM Peddapalli

You cannot copy content of this page

Scroll to Top