జూన్ 27, 2026

WhatsApp Image 2024 01 04 at 6.54.13 PM

TRINETHRAM NEWS

Trinethram News : బాపట్ల జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం

బాపట్ల జిల్లా రేపల్లె పట్టణ పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తూ ఎస్సై ఉద్యోగం సాధించిన ఎమ్.వెంకటేష్ బాబును అభినందించిన జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందాల్ ఐపీఎస్,.

ఎమ్.వెంకటేష్ బాబు 2013 బ్యాచ్ సివిల్ కానిస్టేబుళ్లు గా పోలీస్ శాఖలో భర్తీ అయినాడు. ప్రస్తుతం బాపట్ల జిల్లాలోని రేపల్లె పట్టణ పోలీస్ స్టేషన్ నందు కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తూ, ఇటీవల విడుదలైన ఎస్సై పోటీ పరీక్షల ఫలితాలలో సివిల్ ఎస్.ఐ గా ఎంపిక అయినాడు. జనవరి 4న గురువారం బాపట్ల జిల్లా ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందాల్ ఐపీఎస్ గారిని మర్యాదపూర్వకంగా కలిసినాడు. ఎస్పీ అతడికి శుభాకాంక్షలు తెలిపి అభినందించారు.

జిల్లా ఎస్పీ మాట్లాడుతూ నగరం మండలం వుయ్యూరు వారి పాలెం గ్రామంలోని వ్యవసాయ కూలి రైతు కుటుంబంకు చెందిన ఎమ్.వెంకటేష్ బాబు 2013వ సంవత్సరంలో సివిల్ కానిస్టేబుల్ గా పోలీస్ శాఖలోకి ప్రవేశించి ఏంతో పట్టుదలతో నిరంతరం కృషిచేసి ఇటీవల విడుదలైన ఎస్సై పోటీ పరీక్షల ఫలితాలలో సివిల్ ఎస్.ఐ గా ఎంపిక అవ్వడం అభినందనీయమన్నారు. ఇతరులకు స్ఫూర్తిదాయకంగా నిలవాలని భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించి తల్లిదండ్రులకు, స్వగ్రామానికి మంచి పేరు తీసుకురావాలని, ఎసై శిక్షణను విజయవంతంగా ముగించి సమర్ధవంతంగా విధులు నిర్వహించాలని సూచించారు.

You cannot copy content of this page