గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. ఈరోజు స్వాతి మహిళా సంఘం ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లాలోని వివిధ శాఖల ముఖ్య అధికారులతో స్పందన పబ్లిక్ వెల్ఫేర్ సొసైటీ కమ్యూనిటీ సభ్యుల సమక్షంలో జిల్లా స్థాయి మీటింగ్ కే సురేష్ స్టేట్ ప్రోగ్రాం ఆఫీసర్ అధ్యక్షతన నిర్వహించడం జరిగినది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ప్రసన్న హాజరై మాట్లాడుతూ మహిళలు మరియు ఆడపిల్లల అభివృద్ధిలో ముందుండాలని ఆరోగ్యము కాపాడుకుని నైపుణ్యాలను మెరుగుపరుచుకుని ఉన్నతమైన శిఖరాలకు ఎదగాలని ఆకాంక్షించినారు. ఇట్టి కార్యక్రమానికి హాజరైనటువంటి అడ్వకేట్ ప్రదీప్ ,, అడ్వకేట్ రాజేందర్, అడ్వకేట్ కిరణ్ మాట్లాడుతూ వివిధ చట్టాల పైన అనగా వరకట్న వేధింపులు హింస, మానవ అక్రమ రవాణా, హెచ్ఐవి ఎయిడ్స్ చట్టము, ఆర్టికల్ 21 గురించి విపులంగా సభ్యులను ఉద్దేశించి అవగాహన కల్పించినారు. ఇట్టి కార్యక్రమానికి షీ టీం పెద్దపల్లి జిల్లా నుండి స్నేహలత సురేష్ షీ టీం, భరోసా కోఆర్డినేటర్ ఆశ్రిత టీబీ అలర్ట్ ఇండియా డిస్టిక్ ఇంప్లిమెంటేషన్ ఆఫీసర్ శ్రీనివాస్ టీబీ ఆఫీసర్ సుధాకర్, స్పందన పబ్లిక్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు శారద, సంస్థ యొక్క సిబ్బంది ప్రేమ్ కుమార్, రెహమత్ బోర్డు డైరెక్టర్లు వివిధ ప్రాంతాల నుండి వచ్చినటువంటి సభ్యులు హాజరైనారు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


