డిప్యూటీ కమిషనర్ నాయిని వెంకట స్వామి ఆదేశాల మేరకు
రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. వంద రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా సోమవారం రామగుండం నగర పాలక సంస్థ ఆద్వర్యంలో చేపడుతున్న కార్యక్రమాలను ఆయన పర్యవేక్షించారు. న్యూ మారెడుపాక లో జరుగుతున్న పారిశుద్ధ్య పనులను ఆయన పరిశీలించారు. ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ జ్వరాల వ్యాప్తి కారణమవుతున్న దోమల నిర్మూలనకు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని నగర పాలక సంస్థకు సహకరించాలని కోరారు.
తమ పరిసరాలలో ఖాళీ స్థలాల్లో పిచ్చి మొక్కలు పెరగకుండా ,నీళ్ళు నిల్వఉండ కుండా జాగ్రత్తలు చేపట్టాలని అన్నారు. కాగా వంద రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా కoపోస్ట్ యార్డ్ లో వెస్ట్ ఆడిట్ నిర్వహిoచారు. డంపింగ్ యార్డ్ సందర్శించారు. ఈ కార్యక్రమాల్లో సానిటరీ ఇన్స్పెక్టర్ సంపత్ , ఎన్విరాన్ మెంటల్ ఇంజనీర్ మధుకర్ తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


