Collector Koya : గ్రామాలకు 21.04 కోట్ల ఆర్థిక సంఘం నిధులు విడుదల జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ పెద్దపల్లి ప్రతినిధి… జిల్లాలో ఉన్న గ్రామ పంచాయతీలకు 21 కోట్ల నాలుగు లక్షల రూపాయల 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష శనివారం ఒక ప్రకటనలో తెలిపారు జిల్లాలో ఉన్న 13 గ్రామీణ మండలాల పరిధిలో ఉన్న గ్రామాలకు 2023-24, 2024-25 సంవత్సరానికి సంబంధించిన 15వ ఆర్థిక సంఘం నిధులు 13 జనవరి 2026, 17 ఫిబ్రవరి 2026, 26 ఫిబ్రవరి 2026 తేదీలలో మూడు విడతల్లో మొత్తం ఇప్పటి వరకు దాదాపు 21 కోట్ల 4 లక్షల రూపాయలు విడుదల కావడం జరిగిందని, ఇందులో అన్ టైడ్ గ్రాంట్ 5 కోట్ల 73 లక్షలు, టైడ్ గ్రాండ్ 15 కోట్ల 31 లక్షలు ఉన్నాయని తెలిపారు అన్ టైడ్ గ్రాంట్ నిధులతో సంబంధిత కరెంట్ బిల్లుల చెల్లింపు, జీతాల చెల్లింపు, ఇతర కార్యాలయ ఖర్చులు ఉంటాయని, టైడ్ గ్రాంట్ నిధులతో అభివృద్ధి పనులకు సంబంధించి వినియోగించడం జరుగుతుందని కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Collector Koya Sri Harsha releases 21.04 crore Finance Commission funds

You cannot copy content of this page

Scroll to Top