పెద్దపల్లి ఆగస్టు 26: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. మంగళవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష పెద్దపల్లిలోని తెనుగువాడ ఎంపీ.పీ.ఎస్. పాఠశాలను సందర్శించారు .. మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో జరుగుతున్న అదనపు తరగతుల గదుల నిర్మాణ పనులను కలెక్టర్ పరిశీలించి తరగతి గదులను నాణ్యతతో సకాలంలో పూర్తి చేసి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకొని రావాలని సంబంధిత అధికారులను ఆదేశించారు
వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా పాఠశాల ప్రాంగణంలో విద్యార్థులతో కలిసి కలెక్టర్ మొక్కలు నాటారు. పాఠశాలలోని విద్యార్థులకు మట్టి గణపతి విగ్రహాలను కలెక్టర్ పంపిణీ చేశారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ హర్ష మాట్లాడుతూ, పర్యావరణాన్ని పరిరక్షించడం మనందరి బాధ్యత అని కలెక్టర్ తెలిపారు. వినాయక చవితి పండుగ సందర్భంగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు వాడటం వల్ల పర్యావరణానికి నష్టం వాటిల్లుతుందని, ప్రతి ఒక్కరూ మట్టి గణపతిని పూజించి పర్యావరణాన్ని కాపాడాలని కలెక్టర్ కోరారు. పాఠశాలలోని పరిసరాలను పరిశీలించారు. విద్యార్థులకు పాఠశాల సిబ్బందికి జిల్లా ప్రజలకు కలెక్టర్ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు
ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట మున్సిపల్ కమిషనర్ వెంకటేష్,ఏ.ఈ.సతీష్, ఉపాధ్యాయులు, సంబంధిత అధికారులు,తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


