Chinthakunta Vijayaramana Rao : మున్సిపాలిటీ ఆధ్వర్యంలో మట్టి వినాయకుల పంపిణీ

TRINETHRAM NEWS

పెద్దపల్లి చింతకుంట విజయరమణ రావు

పెద్దపల్లి త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. పెద్దపల్లి పట్టణంలోని జెండా చౌరస్తా వద్ద పెద్దపల్లి మునిపాలిటీ ఆధ్వర్యంలో విఘ్నేశ్వర నవరాత్రుల సందర్భంగా మట్టి గణపతులు మున్సిపల్ కమిషనర్ మరియు స్థానిక నాయకులతో కలిసి ప్రజలకు పంపిణీ చేసిన గౌపెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయరమణ రావు మాట్లాడుతూ.. విఘ్నేశ్వర నవరాత్రులలో మట్టి గణపతిని ప్రతిష్టించి పర్యావరణాన్ని కాపాడుకుందాం అని అన్నారు. పెద్దపల్లి మున్సిపల్ ఆధ్వర్యంలో మట్టి గణపతి ప్రతిమలను ప్రజలకు పంపిణీ చేయడం సంతోషకరమని అన్నారు.

పెద్దపల్లి పట్టణంలో జరుతున్న అభివృద్ధి కార్యక్రమాలను అందరికీ వివరించారు. పెద్దపల్లి పట్టణంలోని కోట్ల రూపాయలను ఖర్చు చేస్తూ ప్రతిష్టాత్మకంగా చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు పట్టణ ప్రజలందరూ సహకరించాలి కోరారు. అభివృద్ధి విషయంలో రాజి పడేది లేదని తెలిపారు. గణపతి నవరాత్రుల విషయంలో ఎలాంటి అవాంఛ సంఘటనలు మరియు ఎలాంటి అల్లర్లు లేకుండా శాంతి యుతంగా అందరూ నవరాత్రులు జరుపుకోవాలని ప్రజలను కోరారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Distribution of clay Vinayakas

You cannot copy content of this page

Scroll to Top