పెద్దపల్లి, ఏప్రిల్-17// త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన చికిత్స అందించడం జరిగిందని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష గురువారం ఒక ప్రకటనలో తెలిపారు గురువారం సాయంత్రం పెద్దపల్లి మండలం అప్పన్నపేట అందుగులపల్లి శివారులో రాజీవ్ రహదారి పై ఆర్టిసి బస్సు , లారీ ఢీ కొట్టగా, ప్రమాదంలో గాయపడిన 29 మందిని జిల్లా ఆసుపత్రిలో అడ్మిట్ చేయగా,బాధితులందరికీ ఫస్ట్ ఎయిడ్ పూర్తి చేసి, అవసరమైన వారికి ఇన్ పేషెంట్ సేవలు అందిస్తుందని తెలిపారు
ప్రమాదానికి గురైన బాధితులకు జిల్లా ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ శ్రీధర్, మరో 10 పదిమంది వైద్య బృందం సకాలంలో అటెండ్ కావడంతో ఎటు వంటి ప్రాణ నష్టం జరగలేదని, ప్రమాద బాధితులకు సత్వరమే మెరుగైన చికిత్స అందించిన వైద్య బృందాన్ని అభినందిస్తున్నట్లు కలెక్టర్ ఆ ప్రకటనలో తెలిపారు జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, పెద్దపల్లిచే జారీ చేయనైనది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


