త్రినేత్రం న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం. అశ్వారావుపేట నియోజకవర్గం దమ్మపేట మండలం అంకంపాలెం గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు జారే ఆదినారాయణ ఆదేశాలమేరకు ఈరోజు అంకంపాలెం పంచాయతీ పరిధిలో ఇరవై మంది లబ్ధిదారులకు గ్రామ పంచాయతీ కార్యదర్శి పృధ్వీ ఆద్వర్యంలో ఇళ్ళ పట్టాలు అందచేయడం జరిగింది.. ఈ కార్యక్రమంలో దమ్మపేట యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు కాక రమేష్ మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అర్హులైన ప్రతి పేదవాడికి నిష్పక్షపాతంగా, పార్టీలకు అతీతంగా ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పంపిణీ చేయడం కాంగ్రెస్ పార్టీ కి మాత్రమే సాధ్యమని తెలిపారు..
అశ్వారావుపేట శాసన సభ్యులు జారే ఆదినారాయణ కృషి వల్ల, గృహ నిర్మాణ శాఖ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి సహకారంతో నియోజకవర్గ వ్యాప్తంగా అదనంగా మరో వెయ్యి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయించి అర్హులైనా ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇళ్లు పంపిణీ చేసిన ఘనత మన ఎమ్మెల్యే జారే ఆదినారాయణకి దక్కిందని కొనియాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను అత్యధికంగా పూర్తి చేసిన ఎమ్మెల్యే జారే ఆదినారాయణ అని తెలిపారు.కాంగ్రెస్ పార్టీ నిబద్ధత కలిగి ప్రజల శ్రేయస్సు కోసం పనిచేస్తున్నదనీ, గత ప్రభుత్వం పది సంవత్సరాలలో డబుల్ బెడ్ రూం ఇళ్ల పేరుతో ప్రతీ పెదవాడిని మోసం చేసిందని, కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికలలో ఇచ్చిన హామీని నెరవేర్చడం లో సఫలం అయ్యారని యూత్ కాంగ్రెస్ దమ్మపేట అధ్యక్షులు కాక రమేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు వాడే వెంకటరావు, మాజీ సర్పంచ్ మోకాళ్ళ గురుమూర్తి, కాంగ్రెస్ పార్టీ నాయకులు కాక వేంకటేశ్వరరావు, పెనుబల్లి వెంకటేష్, వగ్గేల పొట్టి, కాక ప్రసాద్,కోండ్రు శ్రావణ్, వల్లేపు రాజు, నందిగాం గౌతం,ఇందిరమ్మ కమిటీ సభ్యులు,ఇందిరమ్మ లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


