త్రినేత్రం న్యూస్ పెనుమూరు. జీడీ నెల్లూరు నియోజకవర్గం పెనుమూరు మండలం ఉగ్రాణం పల్లి గ్రామపంచాయతీ నందు సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ పై రాష్ట్రప్రభుత్వం ఆదేశాల మేరకు స్వయం సహాయక సంఘాలకు, షాప్ ల యజమానులకు అవగాహన కల్పించడం కోసం పెనుమూరు మండల అభివృద్ధి అధికారి నీలకంఠేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. ఇందులో భాగంగా జీఎస్టీ తగ్గింపు వల్ల కలిగే లాభాలను, తద్వారా ప్రజలకు చేకూరే లాభాలగురించి వివరించారు. షాపు యజమానులు కూడా జీఎస్టీ తగ్గిన మేర కొనుగోలుదారులకు లబ్ధి చేకూరేలా వస్తువులు సరఫరా చేయాలని, అలాగే షాపుల వద్ద బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. సచివాలయ సిబ్బంది గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి ప్రజలకు అవగాహన కల్పించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా అధ్యక్షురాలు అరుణ, ఏపీవో గుణశేఖర్, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


