తేదీ : 10/06/2025. గుంటూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో ఎక్కడైనా రేషన్ దుకాణాలలో సర్వర్ సమస్య వస్తే ఆపకుండా ఫోటో మరియు సంతకంతో సరుకులు పంపిణీ చేయాలని రాష్ట్ర పౌర శాఖ మంత్రి నాదెండ్ల .మనోహర్ అన్నారు. నిర్లక్ష్యానికి తావు లేకుండా పనిచేయాలని సూచించారు. ఉదయం సమయం ఎనిమిది గంటల నుండి మధ్యాహ్నం సమయం పన్నెండు గంటల వరకు, మరియు సాయంత్రం సమయం నాలుగు గంటల నుండి రాత్రి సమయం ఎనిమిది గంటల వరకు చౌక ధరల దుకాణాల్లో బియ్యం సరుకులు పంపిణీ చేయాలని పేర్కొన్నారు. తప్పనిసరిగా సర్వర్ పనిచేయడం యెడల లబ్ధిదారుల ఫోటో సంతకం తీసుకుని రేషన్ ఇవ్వాలని స్పష్టం చేయడం జరిగింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


