
అడవిశ్రీరాంపూర్ తండ్రి జ్ఞాపకార్థం ప్రభుత్వ పాఠశాలకు గ్యాస్ స్టవ్, సిలిండర్ వితరణ
త్రినేత్రం న్యూస్. ముత్తారం ఆర్ సి
ముత్తారం మండలంలోని అడివి శ్రీరాంపూర్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలకి మధ్యాహ్న భోజన పథకం సౌకర్యార్థం అడవి శ్రీరాంపూర్ గ్రామానికి చెందిన గంగాధర విజయ్ కుమార్ తండ్రి గతంలో మరణించగా తండ్రి జ్ఞాపకార్ధంగా పాఠశాలకు వారి కుమారుడు విజయ్ కుమార్ గ్యాస్ సిలిండర్, గ్యాస్ స్టవ్ ను ఎంఈఓ,పాఠశాల ప్రధానోపాధ్యాయుడు , పాఠశాల చైర్మన్ చిగురు స్రవంతి సాగర్ ఆధ్వర్యంలో అందజేశారు. ఈ సందర్భంగా విజయ్ కుమార్ మాట్లాడుతూ తన తండ్రి జ్ఞాపకార్ధంగా విద్యార్థులకు మధ్యాహ్న భోజనం సౌకర్యార్థం గ్యాస్ సిలిండర్,గ్యాస్ పొయ్యిలు వితరణ చేయడం తనకు ఎంతో సంతృప్తిని ఇస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ ప్రధాన ఉపాధ్యాయులు ఓదెలు, పాఠశాల చైర్మన్ చిగురు స్రవంతి సాగర్, ఉపాధ్యాయులు మహిపాల్ రెడ్డి, నరసింహారెడ్డి, సతీష్, రమేష్, సునీత, ఉష,రూబీనా శంకర్ తోపాటు తదితరులున్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
