మంథని మున్సిపల్ భవన నిర్మాణానికి అనువైన స్థలం ఎంపిక జిల్లా కలెక్టర్ కోయ హర్ష

TRINETHRAM NEWS

మంథని మున్సిపల్ భవన నిర్మాణానికి అనువైన స్థలం ఎంపిక జిల్లా కలెక్టర్ కోయ హర్ష

*సంక్రాంతి లోపు జాతీయ రహదారి ట్రెంచ్ కట్టింగ్ పూర్తి చేయాలి

మంథని పట్టణంలో పర్యటించి పురపాలక కార్యాలయానికి స్థలాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ కోయ హర్ష

పెద్దపల్లి, జనవరి-02: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

మంథని మున్సిపల్ భవన నిర్మాణానికి అనువైన స్థలం ఎంపిక చేయాలని జిల్లా కలెక్టర్ కోయ హర్ష తెలిపారు.

మంగళవారం జిల్లా కలెక్టర్ కోయ హర్ష మందని పట్టణంలో పర్యటించి పురపాలక కార్యాలయానికి స్థలాలను పరిశీలించారు. అనంతరం రెవెన్యూ డివిజన్ అధికారి కార్యాలయంలో జాతీయ రహదారి ట్రెంచ్ కటింగ్ పనుల పురోగతి పై సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ హర్ష మాట్లాడుతూ మంథని పట్టణంలో ఓల్డ్ ఎస్సీ హాస్టల్ ను , పట్టణంలోని అందుబాటులో ఉన్న 26 గుంటల స్థలాన్ని కలెక్టర్ పరిశీలించి పురపాలక భవన నిర్మాణానికి అనువైన చోటు ఎంపిక చేయాలని, త్వరలోనే ఐటి పరిశ్రమల శాఖ మంత్రి చే పురపాలక భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు.

అనంతరం వరంగల్ మంచిర్యాల జాతీయ రహదారి నిర్మాణం పనులపై కలెక్టర్ సమీక్షిస్తూ సంక్రాంతి లోపు ట్రెంచ్ కటింగ్ పనులు పూర్తి చేయాలని, ట్రెంచ్ కటింగ్ లో ఎదురవుతున్న ఇబ్బందులను పరిష్కరిస్తూ పనులు వేగవంతంగా జరిగేలా చూడాలని, సంక్రాంతి లోపు సంబంధిత భూములను నేషనల్ హైవే అథారిటీకి అప్పగించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట రెవెన్యూ డివిజన్ అధికారి సురేష్, మంథని మున్సిపల్ కమిషనర్, ఏ.డి.సర్వే ల్యాండ్ శ్రీనివాసులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page

Scroll to Top