డిండి(గుండ్లపల్లి) ఏప్రిల్ 18 త్రినేత్రం న్యూస్. డిండి మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులో ఐకెపి, పిఎసిఎస్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి ఎమ్మెల్యే నేను బాలు నాయక్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ధరణి ఉన్నప్పుడు రైతుల సమస్యల పరిష్కారం కోసం రైతులు అధికారులతో తిరగాల్సి వచ్చేది, కానీ భూభారతితో అధికారులే రైతుల వద్దకు వచ్చి సమస్యలను పరిష్కరించబోతున్నారు అని అన్నారు.
రైతులు పొలంలో కష్టపడి పంటలు పండిస్తూనే కోటీశ్వరుడికి అయినా పేదవాడికైనా అన్నం పెట్టేది రైతే. కష్టపడి పంట పండించిన రైతుకు వ్యవసాయ మార్కెట్లో ఎలాంటి కష్టం లేకుండా ధాన్యాన్ని అమ్ముకొని ఆనందంగా ఇంటికి వెళ్లే విధంగా ప్రభుత్వం సౌకర్యాలు కల్పిస్తున్నాoఅని అన్నారు.
కాంగ్రెస్ రైతు ప్రభుత్వం అని రైతుల మేలు కోరే ప్రభుత్వం అని, దొడ్డు రకాన్ని మద్దతు ధరతో కొనుగోలు చేయడంతో పాటు గత ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం సన్న రకాలకు కింటాలుకు 500 రూపాయల బోనస్ ఇస్తున్నది మన ప్రజా ప్రభుత్వం అని, ఇప్పటికే మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం 500 కే సబ్సిడీ గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, 10 లక్షల వరకు ఆరోగ్య భీమా అమలు అవుతున్నాయి అని ఈ సందర్భంగా అన్నారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ మాజీ కమిటీ చైర్మన్ ముక్కామల వెంకటయ్య గౌడ్, డిండి మండలం బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొంతి నేని వెంకటేశ్వరరావు, మండల పార్టీ అధ్యక్షులు రాజేష్ రెడ్డి వర్కింగ్ ప్రెసిడెంట్ బద్దెల శ్రీనివాస్ యాదవ్ తహసిల్దార్ ఆంజనేయులు ఏవో రహేన డిటిసిఎస్ హనుమంతు, శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎంపీపీలు దిక్కు నాయక్ గోవింద్ యాదవ్, మండల పార్టీ అధ్యక్షులు కృష్ణయ్య, మార్కెట్ కమిటీ డైరెక్టర్ గోవర్ధన్ రావు, సీనియర్ నాయకులు తూమ్ సుమీత్ రెడ్డి, మాజీ సర్పంచ్ మేకల కాశన్న, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు గడ్డమీద సాయి కుమార్, నాయకులు పోలం లక్ష్మణ్, తేజు నాయక్, శ్రీనివాస్ గౌడ్, బాలయ్య, లక్పతి నాయక్ , మాజీ ఉప సర్పంచ్ నూకంవెంకటేష్, మల్లేష్, మహిళా నాయకురాలు మాణిక్యమ్మ, ప్రజా ప్రతినిధులు, వేద అనుబంధ సంఘాల నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులు, మాజీ సర్పంచ్ లు, మాజీ ఎంపీటీసీ లు, మాజీ కోఆప్షన్ సభ్యులు, పిఎసిఎస్ డైరెక్టర్, అధికారులు, ఏ ఈ ఓ మల్లేశ్వరి తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


