అల్లూరి జిల్లా త్రినేత్రం న్యూస్ (పాడేరు), మే 7: జనసేన పార్టీ కార్యకర్తలే పార్టీకి అసలైన బలం అనే సూత్రంతో పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ కార్యకర్తలకు భరోసానివ్వడంలో మరో అడుగు ముందుకు వేసారు. ఈ క్రమంలో, పార్టీ క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న సభ్యులకు ప్రత్యేక కిట్లను అందజేసే కార్యక్రమం రేపు గురువారం, 08-05-2025 ఉదయం 11:00 గంటలకు పాడేరు జనసేన కార్యాలయంలో నిర్వహించనున్నారు.
ఈ కార్యక్రమం జనసేన పార్టీ పాడేరు అసెంబ్లీ మరియు అరకు పార్లమెంట్ ఇంచార్జ్ వంపూరు గంగులయ్య ఆదేశాల మేరకు, పార్టీ ఐటీ టీమ్ కోఆర్డినేటర్ సీ.హెచ్ అనిల్ కుమార్ ఆధ్వర్యంలో జరుగనుంది. ఇప్పటికే క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి హాజరై తమ కిట్లను స్వీకరించాల్సిందిగా నిర్వాహకులు కోరుతున్నారు.
ఈ సందర్భంగా జనసేన నాయకులు, కార్యకర్తలు, మహిళా శ్రేణులు, మరియు పార్టీ అభిమానులు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


