ఏపీపీఎస్సీ మూల్యాంకన అక్రమాల ఆరోపణల కేసు
కామన్‌సైన్ సంస్థ డైరెక్టర్‌గా ఉన్న మధు
హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకున్న పోలీసులు
Trinethram News : విజయవాడకు తరలింపు, విచారణకు ఏర్పాట్లు, మార్కుల తారుమారు, నిబంధనల ఉల్లంఘన ఆరోపణలు, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) పరీక్షల మూల్యాంకనంలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలకు సంబంధించి కామన్‌సైన్ అనే ప్రైవేట్ సంస్థ డైరెక్టర్ ధాత్రి మధును పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌లోని ఆయన కార్యాలయంలో అదుపులోకి తీసుకున్న అధికారులు, తదుపరి విచారణ నిమిత్తం విజయవాడకు తరలిస్తున్నారు.
ఏపీపీఎస్సీ నిర్వహించే పరీక్షల మూల్యాంకన ప్రక్రియలో అవకతవకలు జరిగాయని, కొందరు అభ్యర్థులకు అనుకూలంగా వ్యవహరించారని వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో ఈ అరెస్ట్ చోటుచేసుకుంది. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో కీలకమైన ఈ పరీక్షల మూల్యాంకనంలో అక్రమాలు జరిగాయనే ఆరోపణలపై అధికారులు కొంతకాలంగా దర్యాప్తు చేస్తున్నారు.
పోలీసు వర్గాల కథనం ప్రకారం పరీక్షల నిర్వహణ ప్రక్రియలో కొన్ని పనుల కోసం కామన్‌సైన్ సంస్థకు కాంట్రాక్ట్ అప్పగించారు. ధాత్రి మధు నేతృత్వంలోని ఈ సంస్థ మూల్యాంకన ప్రక్రియలో న
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


