TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ పెనుమూరు. పెనుమూరులోని ఎంపీడీవో కార్యాలయంలో శనివారం 11 గంటలకి ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిడి నెల్లూరు శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ డాక్టర్ థామస్ పాల్గొని మాట్లాడుతూ సాగునీటి సమస్యపై అసెంబ్లీలో చర్చించి సీఎం చంద్రబాబు నాయుడు కు ఈ విషయాన్ని గుర్తు చేశానన్నారు. త్వరలోనే ఎన్టీఆర్ జలాశయాని కి మహర్దశ పడుతుందని పేర్కొన్నారు.

జలాశయాన్ని విస్తరించి లోతు పెంచి సాగునీటి చెరువులకు అనుసంధానం చేస్తామన్నారు. తర్వాత ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి రెవిన్యూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నాము అని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం మండల అధ్యక్షుడు రుద్రయ్య నాయుడు, మాజీ ఎంపీపీ హరిబాబు నాయుడు తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

issue of irrigation water