జూన్ 26, 2026

WhatsApp Image 2024 11 19 at 16.00.40

TRINETHRAM NEWS

ప్రపంచ ఉక్కు మహిళగా పేరుగాంచిన ధీశాలి స్వర్గీయ ఇందిరా గాంధీ..
సంక్షేమం, అభివృద్ధికి మారుపేరు ఇందిర పాలన..
ఇందిరా గాంధీ స్ఫూర్తితో తెలంగాణలో రేవంత్ రెడ్డి నాయకత్వం లోని కాంగ్రెస్ పాలన..
కొలన్ హన్మంత్ రెడ్డి ..

Trinethram News : Medchal : ప్రపంచ దేశాలలో ఉక్కు మహిళాగా మాత్రమే కాకుండా తన పాలన దక్షతతో పేరుగాంచిన వీరవనిత మాజీ ప్రధాని భారతరత్న ఇందిరాగాంధీ అని కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కొలన్ హన్మంత్ రెడ్డి అన్నారు.
ఇందిరాగాంధీ జయంతి పురస్కరించుకొని బాచుపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయాంలో పేదలకు ఆమె అందించిన సంక్షేమాని స్మరించుకుంటూ ఆమె చిత్రపటానికి పూలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా హన్మంత్ రెడ్డి మాట్లాడుతూ పేదలకు సంక్షేమం, అభివృద్ధి ని దగ్గరికి చేసి భారతీయుల గుండెలో పదిలంగా నిలిచిపోయారని తెలిపారు. ఆనాడు ఆ మహానేత ముందు చూపుతో చేపట్టిన సంక్షేమ పథకాల ఫలితంగా దేశం అభివృద్ధిలో దూసుకుపోతుందన్నారు. ఇందిరమ్మ పాలన స్ఫూర్తితో తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పాలన కొనసాగిస్తూ అన్ని వర్గాలకు సంక్షేమాన్ని, అభివృద్ధిని అందిస్తుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లా గ్రంథాలయ చైర్మన్ బొంగునూరి శ్రీనివాస్ రెడ్డి, డీసీసీ ఉపాధ్యక్షులు ధమ్మని శ్రవణ్ కుమార్ ముదిరాజ్, డా. || అవిజె జేమ్స్, మాజీ కార్పొరేటర్ల పాల కృష్ణ, సీనియర్ కాంగ్రెస్ నాయకులు కొలన్ శ్రీనివాస్ రెడ్డి, బేకు శ్రీనివాస్, గడ్డం రాజేందర్ రెడ్డి, డివిజన్ నాయకులు లాయక్, గణేష్, పెరికె శివ, సోమన్నగారి శ్రీధర్ రెడ్డి, NMC అధ్యక్షులు కొలన్ రాజశేఖర్ రెడ్డి మరియు , మైనారిటీ నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులు, మహిళ కాంగ్రెస్ నాయకులు, ఎస్సి మరియు ఎస్టీ సెల్ నాయకులు, NSUI నాయకులు, INTUC నాయకులు కాంగ్రెస్ అభిమానులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page