EPFO ​​: భారత ప్రభుత్వ ఈపీఎఫ్ఓ ప్యానల్ న్యాయవాదిగా ధర్నాలకోట

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, రాజమహేంద్రవరం, తూర్పుగోదావరి జిల్లా, భారత ప్రభుత్వ ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల ప్యానల్ న్యాయవాదిగా రాజమహేంద్రవరం కు చెందిన న్యాయవాది ధర్నాలకోట వెంకటేశ్వరరావు నియమితులయ్యారు. గురువారం ఈపీఎఫ్ఓ రీజనల్ కమిషనర్ నుండి వెంకటేశ్వరరావు నియామక ఉత్తర్వులు అందుకున్నారు. మూడు సంవత్సరాల పాటు ఈ పదవిలో వెంకటేశ్వరరావు తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాలోని జిల్లా న్యాయస్థానములు, జిల్లా వినియోగదారుల కమిషన్ లలో ఈపీఎఫ్ఓ తరఫున సేవలందించాల్సి ఉందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

ఈ సందర్భంగా రాజమండ్రి బార్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు, సీనియర్ మరియు జూనియర్ న్యాయవాదులు, జిల్లా వినియోగదారుల రక్షణ మండలి సభ్యులు గొట్టిముక్కల అనంతరావు అడ్వకేట్ వెల్ఫేర్ సొసైటీ రాష్ట్ర అధ్యక్షులు డిఎస్ రాజేశ్వరరావు తదితరులు ధర్నాలకోట వెంకటేశ్వరరావును అభినందించారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Dharnalakota as a panel

You cannot copy content of this page

Scroll to Top