Trinethram News : తిరుమలలో శుక్రవారం అర్ధరాత్రి భక్తులు ఆందోళనకు దిగారు. సర్వదర్శనం కోసం వేచి ఉన్న భక్తులు తమకు సరైన సౌకర్యాలు కల్పించడం లేదని ఒక్కసారిగా నినాదాలు చేశారు.
‘‘టీటీడీ చైర్మన్ డౌన్ డౌన్, ఈవో డౌన్ డౌన్’’ అంటూ క్యూ లైన్లలో వేచిఉన్న భక్తులు నిరసన తెలిపారు. దీంతో టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి వెంటనే వారికి కావాల్సిన సౌకర్యాలను కల్పించారు.
గోవింద నామస్మరణ జరగాల్సిన వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో టీటీడీ చైర్మన్ డౌన్ డౌన్ అనే నినాదాలు వినిపిస్తున్నాయి. పసిపిల్లలకు పాలు, ఆహారం ఇవ్వాలని భక్తులు దేవుని సన్నిధిలోనే ఆందోళన చేస్తున్నారు.
ఇలాంటి పరిస్థితి తిరుమలలో ఎప్పుడూ లేదు. ఒక వ్యక్తి పై విషం చిమ్ముతూ, అణువణువునా ద్వేషాన్ని నింపుకున్న మీడియా మాఫియా చేతుల్లో తిరుమలను పెట్టారు. ఇక భక్తికి, సక్రమమైన పరిపాలనకు ఆస్కారం ఎక్కడుంటుంది?
టీటీడీ చైర్మన్ అసమర్ధతను ఏ మీడియా చూపించకపోయినా ప్రజలే ముందుకు వచ్చి ధైర్యంగా నిరసన తెలుపుతున్నారు. వారిని అభినందించాలి.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


