జూన్ 26, 2026
TRINETHRAM NEWS

పెద్దపల్లి, జూలై 07: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. సోమవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సమీకృత జిల్లా కలెక్టరేట్ లో రోడ్లు భవనాల శాఖ, టి.జి.ఈ.డబ్ల్యూ.ఐ.డి.సి ద్వారా చేపట్టిన అభివృద్ధి పనులు పై సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ, పెద్దపెల్లి జిల్లాలో డిఎంఎఫ్టి, ఇతర నిధుల నుంచి రోడ్లు భవనాలు ,శాఖ ద్వారా చేపట్టిన బ్రిడ్జి, రోడ్లు, ఆసుపత్రి , పాఠశాల భవనాలు , ఇతర అభివృద్ధి పనులు వేగవంతంగా పూర్తి చేయాలని, నిర్దిష్ట గడువులోగా పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొని రావాలని కలెక్టర్ ఆదేశించారు టి.జి.ఈ.డబ్ల్యూ.ఐ.డి.సి ద్వారా జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో చేపట్టిన 102 అభివృద్ధి పనులను సమీక్షించిన కలెక్టర్ వీటిని త్వరగా పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు ఈ సమావేశంలో ఈఈ ఆర్&బీ భావ్ సింగ్, సంబంధిత జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Development works should be

You cannot copy content of this page